అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. శనివారం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ప్రమాద ఘటనపై జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎల్జి పాలిమర్స్ ఘటనలో బాదితుల కుటుంబాలకు అప్పటి సీఎం జగన్ ప్రకటించిన ఆర్థిక సాయం ఇంకా కొంత మందికి అందలేదని అన్నారు. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదంలో తమ ప్రభుత్వం వెంటనే వారి అకౌంట్లలో డబ్బులు జమచేసిందని తెలిపారు.