రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం వల్ల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపై అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. వీటికి తోడుగా నైరుతి ఋతు పవనాలు కూడా తోడు అవడంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.