ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. జవహార్‌నగర్‌లో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలను తమిళిసై పరామర్శించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడారు. ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరంగల్‌లో తీవ్ర స్థాయిలో వరదలు వచ్చి.. జవహార్ నగర్ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని ఆమె కోరారు. భారీ వర్షాల వల్ల చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యయి అని అన్నారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని.. బాధితులకు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లను అందించాలని గవర్నర్ అన్నారు. ఇప్పటికే కేంద్ర బృందం కూడా ఇక్కడకు వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపారు.