కురుమల కులదైవమైన శ్రీబీరప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రరణ్ రెడ్డి తెలిపారు. శ్రీబీరప్ప స్వామి ఆలయాల అభివృద్దికి నిధుల కేటాయింపుపై శాసన మండలిలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం అడిగిన ప్రశ్నకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 శ్రీ బీరప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి రూ. 7. 83 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దేవాదాయ శాఖలో రిజిస్ట్రరై ఉండి బీరప్ప ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నఅర్హులైన వారికి ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ప్రతిపాదనను పరిశీస్తామని చెప్పారు.