అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్స్ (golf course)ను తీర్చిదిద్దుతామని.. 2025 జనవరి – ఫిబ్రవరి లో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ (international golf tournament) నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజతగా నిలిచిన శంకర్ దాస్ కు ట్రోపీ, 15 లక్షల ప్రైజ్ మనీని అందించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ … తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ ను ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ గా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ గోల్ఫర్స్ ఈ చాంపియన్ షిప్ లో పాల్గొంటారని అన్నారు. ఏషియన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ సర్క్యూట్ గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు.