మాజీమంత్రి బాబుమోహన్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడును కలిశారు. టీటీడీపీ నాయకులతో సమావేశం సంధర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన సందర్బంగా చంద్రబాబును ఆయన కలిశారు. బీజేపీ పార్టీలో ఉన్న ఆయన శాసనసభ ఎన్నకల ముందు ఆపార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయన ఉండలేక ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బాబు మూహన్ తాజాగా టీడీపీ ఆఫీస్ కు రావడం.. చంద్రబాబును కలవడంతో ఆయన టీడీపీ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది.
తెలంగాణ నాయకులతో సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ కమిటీలు అన్నీ రద్దు చేశారు. సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు.