మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) తమ నూతన కార్యవర్గ కమిటీని ప్రకటించారు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (ఎం ఎల్ సి, ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్) నూతన కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.
మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ముందుగా మైటా కార్యవర్గ ఎన్నికలకు ప్రాతినిధ్యం వహించిన అమర్ నాథ్ గౌడ్ ని అభినందించారు. నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ సప్త సముద్రాలు దాటి వృత్తి రిత్యా మలేషియా వచ్చి సమాజ సేవకు ఒక వేదికను ఏర్పరుచుకొని తోచినంత సహాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ని కొనియాడారు. భవిషత్తులో మైటా చేసే కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులతో పాటుగా భారీ సంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ.. మైటా ఏర్పాటు చేసి పది సంవత్సరాలు కావస్తున్న సందర్బంగా అసోసియన్ ఏర్పాటు చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. అసోసియన్ స్థాపించిన అనంతరం మైటా ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలను అందులో అడుగడుగునా చేయూతనిచ్చిన కమిటీ సభ్యుల సహకారాన్ని గుర్తు చేసారు. గతంలో మైటా ఏర్పటునుండి నేటి వరకు సభ్యులుగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా గుర్తుచేసి వారి ప్రాధాన్యతన, నడవడికలు నూతన సభ్యులకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు.
ప్రెసిడెంట్ గా సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు , మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ , జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రేజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రేజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవం రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి లతో కూడిన నూతన కార్యవర్గం ఏర్పాటు అయింది.