కర్నూల్ జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఆమె ప్రయానిస్తున్న ఫార్చ్యునర్ కారు ముందు టైరు పేలి బోల్తాపడటంతో కారు పల్టీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హుఠాహుటిన ఆమెను కర్నూల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆమె 2004లో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పత్తికొండ నుండి పోటీ చేశారు. 2009లో ఆలూరు నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపోందారు. 1996లో తన భర్త కూడా హత్యకు గురయ్యారు. తన భర్త మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. నీరజా రెడ్డి ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు.