తెలంగాణలో ఈనెల 30న జరిగే పోలింగ్ లో ప్రతీ ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖ జర్నలిస్ట్ శిగుళ్ల రాజు పిలుపునిచ్చారు. ఓటు హక్కు ద్వారానే మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును డబ్బులకు అమ్ముకోవద్ధని.. బాగా ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఒక బాధ్యతగా భావించి పోలింగ్ రోజు ఓటు వేయాలని అన్నారు.