తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశానికి సీఈసీ (CEC) షరతులతో కూడిని అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి (chief minister) సహా మంత్రులు మంత్రివర్గ సమావేశానికి శనివారం సీఈసీ అనుమతి కోసం రాత్రి వరకూ వేచి చూసినా అనుమతి లభించలేదు. తాజాగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమీషన్ కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రుణమాఫీ లాంటి వాటిపై చర్చను ఎన్నకల కోడ్ ముగిసేంతవరకు, అంటే జూన్ 4వ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలో కేవలం అత్యవసరమైన విషయాలనే చర్చించాలని సీఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.