హైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కాం.. సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలన విషయాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే నడిచిందని ఈడీ (Enforcement Directorate) రిపో్ర్ట్ లో బయటపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేత మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును చేర్చింది. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. విజయ్ నాయర్, ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్, అర్జున్ పాండే, అందరూ చర్చలలో ఉన్నారని ఈడీ తన రిపోర్టులో నమోదు చేసింది. వీరి మీటింగ్ ఎనిమిది గంటలపాటు జరిగిందని మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

ఈ లిక్కర్ స్కాంలో.. సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ( Aam Aadmi Party) వంద కోట్ల రూపాయలు హవాలా ద్వారా వెళ్లాయని ఆడిటర్ బుచ్చి బాబు ఒప్పుకున్నారని కూడా ఈడీ ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి ప్రాతినిధ్యం వహించారని.. ఆప్ నేత సిసోడియా తరపున విజయ్ నాయర్ లు పని చేశారని.. సౌత్ గ్రూప్ కు అనుకూలంగా వల్ల మద్యం కంపెనీలో ఎమ్మెల్సీ కవితకు వాటాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.

అంతకుముందు, ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై కోర్టుకు తెలిపాడు. దీనిపై శుక్రవారం రోజు మధ్యాహ్నం కోర్టులో లాయర్ ద్వారా పిళ్లై పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిళ్లై పిటిషన్ పై స్పందించాలని స్పెషల్ కోర్టు ఈడీ కి నోటీసులను జారీ చేసింది.

హుఠాహుటిన ఢిల్లీకి మంత్రి KTR

image 2023 03 10 214727100

ఎమ్మెల్సీ కవిత రేపు ఈడీ ముందుకు హాజరవనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ హుఠాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగియగానే ఆయన బయలు దేరి వెళ్లారు. ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం సాయంత్రమే బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఢిల్లీ వెళ్లింది. కేటీఆర్ అక్కడికి చేరుకోగానే కవితతో పాటు లీగల్ టీమ్ తో భేటీ కానున్నారు. రెండు రోజులపాటు మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ మీటింగ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చ

brs party meet

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి రావడం.. ఈడీ (Enforcement Directorate) అధికారులు ఆమెను శనివారం రోజు ప్రశ్నించేందుకు సిద్దమైన నేపథ్యంలో ఈ అంశంపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్సీ కవితను బద్నాం చేయాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు చేస్తుందని కేసీఆర్ ఆరోపంచారు. బీజేపీని దేశం లో నుండి తరిమిమివేసే వరకు విశ్రమించకూడదని అన్నారు. కక్ష పూరితంగానే బీఆర్ఎస్ నాయకులపై సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తోందని అన్నారు. బీజేపీ ఎత్తుగడలను తప్పికొట్టాలని.. పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టం చేశారు. వీలైనంత వరకూ నాయకులందరూ ప్రజల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ దిశా నిర్థేశం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img