హైదరాబాద్ శివారులో జరిగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి నగర శివారు ప్రాంతం జన్వాడా రిజర్వు కాలనీలో భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో 24 మందికి పోలీసులు డ్రగ్స్ పరీక్షలు జరిపారు. ఒక వ్యక్తికి కొకైన్ తీసుకున్నాడని రిపోర్టు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో మెత్తం 35 మంది పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ జరిగిన ఫాం హౌజ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలదిగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో క్యాసినోకి సంబంధించిన పరికరాలు కూడా పోలీసులు గుర్తించారు. మోకిలా పోలీస్ పోలిస్ స్టేషన్ లో రాజ్ పాకాలపై కేసు నమోదు చేశారు. అయితే ఈపార్టీలో కేవలం కుటుంబసభ్యులే పాల్గొన్నారని, డ్రగ్స్ వినియోగించలేదని రాజ్ పాకాల సన్నిహితులు అంటున్నారు.