టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భావించిన కేసీఆర్ సర్కార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకున్న అధికార పక్షానికి ఊహించని షాక్ ఎదురైంది. ఆర్టీసీ బిల్లు ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ముందస్తు అనుమతి కోసంఆర్టీసీ బిల్లును ఈనెల 2న తమ వద్దకు వచ్చిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేయాలని.. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకోవాలి కాబట్టి మరింత సమయం పడుతుందని రాజ్ భవన్ వర్గాలు సమాచారాన్ని ఇచ్చాయి. అయితే, ఈ బిల్లు సభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపినా సరిపోతుంది అని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.