యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ అధికారులు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు కొండపైకి భారీగా వాహనాలు రావడంతో పార్కింగ్ ఇబ్బందులతో, ట్రాఫిక్ స్ధంభించిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.