ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్, టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారి పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు సమీరుల్లా, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్, కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.