వరద బాధితులకు 10వేల రూపాయల పరిహారిం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జీహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీస్ ను ముట్టిడించారు. ఆఫీసు లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలను, కార్పొరేటర్ విజయారెడ్డితో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రికార్ఢు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలతో జనజీవనం స్తంభించి పోయింది. వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కొందరు గల్లంతు కాగా.. మరికొంత మంది మృత్యువాతపడ్డారు. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వర్షాలతో నగర పౌరులు ఇబ్బందులు పడుతుంటే, హైదరాబాద్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు జీహెచ్ ఎంసీని ముట్టడించాయి. నగరంలోని వరద బాధితులకు ఇంటికి 10 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులతో, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.