కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇదివరకే ప్రకటించిన 6 గ్యారంటీలకు తోడు మరో 36 అంశాలతో కూడిన మేనిఫెస్టోను గాంధీ భవన్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు.