శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావశీలమైనవనీ, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు