కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఎమ్మెల్యేలకు కాపలాగా హైటెన్షన్ వైర్ లాగా ఉండడం అంటే అభద్రతా భావంతోనే అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీ గాలి వీస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని, రాష్ట్రంలో కూడా లేకుండా పోతుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం లేకుండా ఉండలేక పోతున్నారని దుయ్యబట్టారు. త్వరలో ప్రారంభం కాబోయే కేసీఆర్ బస్సు యాత్రపై విమర్శలు గుప్పించారు. తండ్రి కొడుకులు మోకాల్ల యాత్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు వారిని నమ్మరని అన్నారు. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసినా బీజేపీ గెలుపును ఆపలేరని అన్నారు. తెలంగాణలో 12 సీట్లకు పైగా తాము గెలుస్తామని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు.