శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమేనని అన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చునని.. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు..