Menu

  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు
AP CM CHANDRABABU potti sriramulu

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ ఏపీ ముఖ్యమంత్రి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని .. మనం, మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండడమే పండుగ పరమార్దమని ఆయన తెలిపారు. ఆర్థిక అసమానతలు తొలగిపోయి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతానని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన P4 (పబ్లిక్ -ప్రైవేటు- పీపుల్-పార్టనర్షిప్) విధానంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు.

1
2
Share the post

Also Read..