వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇది వరకే ప్రకటించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ భయంతోనే కేసీఆర్ ఆర్టీసీ విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి ఆస్తులు కూడా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే అని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ఆర్టీసీ ఆస్తులు రాష్ట్ర ప్రజల ఆస్తులని అన్నారు 1978వ సంవత్సరంలో ఇంటికో దీపం- ఊరికో బస్సు నినాదంతో ఇందిరా గాంధీ గ్రామ గ్రామానికి బస్సులు వేయించిన చరిత్ర అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.