సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదివారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీజేఐకి టీటీడీ ఆలయ ఈవో శ్యామలారావు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సీజేఐ కుటుంబసభ్యులకు రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.