స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ‘ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమంత (samantha), వరుణ్ ధావన్ (Varun Dhavan) కాంబోలో ఈ సిరీస్ వస్తోంది. హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా (Priyanka chopra) నటించిన సీటాడెల్ కు రీమేక్ గా వస్తోంది. ఇటీవల లండన్ లో ఈసిరీస్ ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రియాంకాతో పాటు సామ్ కూడా పాల్గొన్నారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తాజాగా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

