జాబిల్లిపైకి వెళ్లాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కల మరి కొన్ని రోజుల్లో నిజం కాబోతోంది. చంద్రయాన్-3 (Chandrayaan-3) శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఏపీ లోని శ్రీహరికోట (Sriharikota) నుంచి బాహుబలి రాకెట్ (LVM3) ఎం4 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది. కౌంట్‌డౌన్‌ను గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో (ISRO) ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపించారు. ఆగస్టు 23 లేదా 24 న చంద్రునిపై ల్యాండింగ్ అవనుంది.