ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు శనివారం చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సీబీఎన్ అధ్యక్షుడు, ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తలారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుపరిపాలనకు, విజన్ కు కేరఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక ఆరోగ్య పరంగా కూడా 74 ఏళ్లకు సంపూర్ణతో నేటికి ఫిట్నెస్ తో ఉండటం అయినకె సాధ్యం అన్నారు. నేటి యువ నేతలకు భావి పాలకులు అయిన ఒక ఉదాహరణ, మార్గదర్శి అన్నారు.
టెక్నాలజీని ఒడిసి పట్టుకొని ఇటు యూత్ కు ఉపాధి అవకాశాలు ఇస్తు ఆర్ధికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసిన నేత అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చొరవతో నేడు పార్టీ ప్రతిష్టాత్మకంగా ఉందన్నారు. ఎన్టీఆర్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తు నాడు జన్మభూమితో ప్రజలతో మమేకం అవుతూ ప్రజల వద్దకే పాలన అంటు ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నేత అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు ఇంత సుదీర్ఘ అనుభవం, బాధ్యతగా భరోసాను ఇస్తున్న చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటు ఆశీర్వదించాలని శ్రీనివాసరావు కోరారు.