తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచే వేడుకలకు ఆయన పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 16న ఔరంగాబాద్ నుండి నేరుగా రాత్రి 7:55 నిమిషాలకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్ పోర్టునుండి నేరుగా CRPF సెక్టార్ ఆఫీసర్స మెస్ కు చేరుకొని, రాత్రి అక్కడే బస చేయనున్నారు. 17వ తేదీన ఉదయం సికింద్రాబాద్ లోని పరేడ్ మైదాన్ లో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటారు.