ప్రముఖ తెలంగాణ జానపద గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. ఆమె తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో గల త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ బర్త్ డే పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అలాగే సినిమా పరిశ్రమకు చెందిన సుమారు 50 మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం, నిషేధిత గంజాయి ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు త్రిపుర రిసార్ట్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల్లో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read..| కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ !
పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. పార్టీలో గంజాయి ఎలా సరఫరా అయింది, ఎవరు దీని వెనుక ఉన్నారు. అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరికొంత మంది అరెస్టులు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఈ వివాదంలో చిక్కుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.