సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బహిరంగసభ రద్దయింది. ఈ సభ కోసం రక్షణ శాఖ నుండి అనుమతిని కూడా తీసుకున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం ప్రకారం సభ ను క్యాన్సిల్ చేశారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై గ్రేటర్ హైదరాబాద్ లోని నేతలు సిద్ధం అవుతున్న సమయలో వర్షం కారణంగా ప్రజా ఆశీర్వాద సభను పార్టీ రద్దు చేసింది. ఎన్నికలకు నాలుగు రోజులే సమయం ఉండటంతో బహిరంగ సభకు ప్రత్యామ్నాయాలను పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు.