జనగామ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. చేర్యాల మండలం మేజర్ గ్రామపంచాయతీ ఆకూనూరు గ్రామంలో గులాబీ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజు ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారని బాలరాజు అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని అన్నారు. గ్రామంలోని ప్రతీ వ్యక్తినీ కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయాలని, కోరుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. జనగామలో పల్లా విజయం ఖాయమని పాల రాజు ధీమా వ్యక్తంచేశారు. ప్రచారంలో బాలరాజుతో పాటు గ్రామ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







