బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రగతి భవన్ లో కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుండి ప్రారంభం కాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. పార్టీ అనుసరించవలసిన విధానాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిలపై పార్లమెంటులో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా, నిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావుతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు పాల్గొన్నారు.