ఎన్నికల ప్రచారంలో డిహైడ్రేషన్ కారణంగా ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొద్దిసేపు ఆమె విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపు ఓ చిన్నారితో ముచ్చటించారు. అనంతరం తన ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించారు.దీనిపై కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో స్పందిస్తూ … “నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను” అని పేర్కొన్నారు. చిన్నారితో ముచ్చటిస్తున్న వీడియోను ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Sorry for the little scare. I’m doing just well, also happened to have met this sweet little girl and after spending time with her I’m feeling a little more energetic. #KCROnceAgain campaign to resume shortly. ✊🏻 pic.twitter.com/YaO1Siw7Vk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 18, 2023