హైడ్రాపేరుతో హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్: హ‌రీష్ ఫైర్

రాష్ట్రంలో ప్రతి ఇంటిలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా.. ప్రత్యర్థులపై విషంచిమ్మే ప్రయత్నం చేస్తోంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విష జ్వరాలతో పిట్టల్లాగా ప్రజలు రాలిపోతాఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో గజగజ లాడుతున్నారని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 36 శాతం డెంగీ కేసులు పెరిగాయన్నారు.

లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం రోడ్ల‌పై ధర్నాలు చేస్తున్నార‌ని అన్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతోందని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేవంలం ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్ర‌భుత్వం పని చేస్తోందని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడని.. ప్రజల పక్షాన నిబద్దతగా పని చేసిన వ్యక్తి అని అన్నారు.

కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేకపోతే ఇబ్బంది పెడతాం అన్నట్లు రేవంత్ తీరు క‌నబ‌డుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అక్రమకేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధరణితో రేవంత్ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. పటాన్ చెరువు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని.. 300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకునేలా ఇబ్బందుల‌కు గురిచేశార‌ని అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని.. ఆయ‌న‌ భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారన్నారు. మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంద‌ని ఆరోపించారు. న్యాయం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నార‌ని తీవ్రంగా విమ‌ర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ లు ఒక్క ఇంచు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి 24గంటల్లో రాజేశ్వ‌ర్ రెడ్డే తొలిగిస్తారని అన్నారు. మెడికల్ కాలేజీలో ఎంతో మంది వైద్యం పొందుతున్నార‌ని అన్నారు. 813 సర్వేనెంబర్లో బఫర్ జోన్ లో గానీ, ఎఫ్టీఎల్ ప‌దిదిలో కానీ లేదని అప్పటి జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సర్వే రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. హెచ్ఎండీఏ పర్మిషన్ కూడా ఉంద‌ని అన్నారు. పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమేన‌ని అన్నారు. అధికారం ఉందని రాత్రికిరాత్రే బుల్డోజింగ్ పద్ధతి చేయటం సరికాదని అన్నారు. అధికారులు అత్యత్సహానికి పోవద్దని.. అన్ని పరిశీలించండని కోరారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దని అన్నారు.

ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం 65 వేల కోట్లని.. అప్పులు గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేద‌ని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ‌త 9 సంవత్సరాలలో నాలుగు లక్షల 26 వేల కోట్ల‌ అప్పు మాత్రమే చేసిందన్నారు. అప్పులు పేర్లు ఇచ్చిన హామీల‌ను తప్పించుకొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని విమ‌ర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇంకా ఇవ్వలేదని.. గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ అటకెక్కిందన్నారు. సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే.. రాజకీయ కుట్రలకే ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌రిమితం అవుతున్నార‌ని హ‌రీష్ రావు మండిప‌డ్డారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img