బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 3, 2023) నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన చేపట్టనున్నారు.
రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.