సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకు శవ యాత్ర చేసి, దగ్ధం చేశారు. ఐదు సంవత్సరాల నుండి ఎంపీ రేవంత్ రెడ్డి కనిపించకుండా పోయి మల్కాజ్‌గిరి ప్రజలను మోసం చేశారని బొంతు రామ్మోహన్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.