రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని ఈనెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ , ధర్నాచౌక్ లో తెలంగాణ బీజేపీ నాయకులు 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. రైతు హామీల సాధన కోసం చేపట్టే ఈదీక్షపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పాల్గొన్నారు.