రాష్ట్రంలో వర్షాలు, వరదలతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే, వారిని పరామర్శించే దిక్కు లేదు అని .. ఎన్నికల్లో ఎలా గెలవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో పంట దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన డి.కే అరుణ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వర్షాల వల్ల వేలాది ఎకరాలలో పంట దెబ్బతిన్నదని అన్నారు. రాష్ట్రంలో రైతు ససమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. సీఎం దత్తత గ్రామం మోతెలో చెక్ డ్యాంల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రులు ఇంజనీర్లు గా వ్యవహరిస్తున్నారనీ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేవలం కమీషన్ల కోసమే చెక్ డ్యాంల నిర్మాణం చేశారని మండిపడ్డారు. భారీ వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలన్నారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు ఇవ్వాలనీ.. అలాగే సీఎం తన దత్తత గ్రామం మోతే కు వచ్చి రైతుల కష్టాన్ని తెలుసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే అరుణ డిమాండ్ చేశారు.
వరద ముంపు ప్రాంతాల సందర్శనలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని వేల్పూర్ మరియు మోతే గ్రామాల్లో పర్యటించి వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను పరామర్శించడం జరిగింది.
— D K Aruna (@aruna_dk) July 30, 2023
♦️అవినీతి సొమ్ము కోసం కమిషన్లకు కక్కుర్తి పడి అవసరం లేని చోట చెక్ డ్యాములు… pic.twitter.com/ukFexHuxtJ