అలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. మోటకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మండలంలోని తేర్యాల, చామాపూర్, కొండాపురం, కదిరేనిగూడెం, నాంచారిపేట కాటేపల్లి, ముత్తిరెడ్డిగూడెం, చాడ, సికిందర్ నగర్లో ఐలయ్య పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన బీర్ల ఐలయ్యకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రచారంలో టీడీపీ, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
