బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలకంటే ధర్మమే ముఖ్యమని.. హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకునేందుకు కూడా వెనుకాడనని స్పష్టం చేశారు. హిందూ ధర్మ రక్షణ కోసం, ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశానన్నారు. ధర్మం కోసం కొట్లాడిన తాను ఏనాడూ చావుకు భయపడలేదన్నారు. చావే తనను చూసి భయపడిందన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజాసింగ్, తన లాంటి వాళ్లను గెలిపించకపోతే ఇకపై ఎవరూ కూడా హిందూ ధర్మం గురించి మట్లాడే వారుండరని తెలిపారు. కరీంనగర్ లోని వివిధ డివిజన్లకు చెందిన 500 మంది యువకులు శుక్రవారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
Live : Election Campaign at Subashnagar, Karimnagar. https://t.co/qKxwx8Z50z
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 17, 2023