బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. తమ నాయకురాలు ఎమ్మెల్సీ కవతపై అనుచిత కామెంట్లు చేశారని మండి పడ్డారు. ఆయన వెంటనే భేషరతుగా ఎమ్మెల్సీ కవితతో పాటు మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం రోజన విలేఖరులతో మాట్లాడుతుండగా “ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారా ?” అని మీడియా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానండగా “కేసుల్లో ఉన్నవారిని ఈడీ అరెస్టు చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా ?” అన్న మాటలను ఈ రోజు కవిత ఈడీ ముందుకు విచారణకు హాజరవగానే.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెరమీదకు తీసుకవచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కి, బీజేపీ పార్టీకి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. అనంతరం చాలా చోట్ల సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. బంజారాహిల్స్, సిద్దిపేట, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంది. మహిళా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మా రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్రమైన విచారణ జరపాలని ఆమె డీజీపీని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న మహిళా మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా.. లేదా పార్టీ వ్యాఖ్యలా.. తేలాలి అని డిమాండ్ చేశారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక రాష్ట్రంలో రాజకీయ విలువలు దిగజారి పోయాయని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని.. ప్రజాస్వామ్యంలో అనుచిత వ్యాఖలకు తావులేదని వారు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని.. వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై సీబీఐ, ఐటీ, ఈడీ లను వేటకుక్కల్లా ఉసిగొల్సుతుందని విమర్శించారు. ఇక నుండి బీజేపీ ఆటలు సాగవని.. ఆ పార్టీ మెడలు వంచే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో మేయర్ వాగ్వాదం

ఓవైపు కవితను ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్ లోనూ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆయన నోరును ఫినాయిల్ తో శుభ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌ గేటు వద్దకు హైదరాబాద్ మేయర్‌ గద్వాల విజయ లక్ష్మితో పాటుగా ఎమ్మెల్యే గొంగడి సునీత, బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు అక్కగడికి చేరుకున్నారు. వారందరూ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

mayaor protest

గవర్నర్ అపాయింట్ మెంట్ లేదని.. మేయర్‌, బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లను పోలీసులు రాజ్ భవన్ గేటు వద్దనే అడ్డుకున్నారు. దీంతో రాజ్‌భవన్ ముందు మేయర్‌ తో పాటు కార్పొరేటర్లు బైఠాయించారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు పేద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ రోజు ఉదయం నుండి ప్రయత్నిస్తున్నా గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదన్న మహిళా నేతలు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసేంతవరకు అక్కడి నుండి తిరదగి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో.. పోలీసులతో మేయర్‌ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ గోడకు ఫిర్యాదు పత్రాన్ని అతికించారు. తరువాత అక్కడి నుండి ట్యాంక్ బండ్ మీద ఉన్నఅంబేడ్కర్ విగ్రహం వరకూ కాలి నడకనే నేతలంతా వెళ్లారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img