శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగి పోతున్నాయి..ప్రతి ఏటా, మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని అయ్యప్ప భక్తులు భావిస్తారు.