ఈ నెల 20 నుండి 24 వరకు హైదరాబాద్ లోని సైఫాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసు కాంప్లెక్స్ లో ఆడిట్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశాఖ పరిపాలనా విభాగం డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాలను ఈనెల 20 న రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈనెల 21 న మధ్యాహ్నం 2.30 గంటల నుండి జరిగే ప్యానల్ డిస్కషన్ లో జి.ఎస్. టి . & కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నింజే, పారదర్శక పాలన ప్రచారకర్త & ఫ్యాకల్టీ ఫౌండర్ డి . రాకేష్ ఇన్వెస్టిగేషన్ విభాగం డీజీఐటీ సంజయ్ బహదూర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా మిల్లెట్, హాండ్లుం , ఆయిల్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22 న రక్త దాన శిభిరం, హెల్త్ క్యాంప్, కాన్సర్ చెక్ అప్ క్యాంప్ లతో పాటు నిపుణులచే ఆరోగ్యం, రూరల్ టెక్నాలజీ & నిర్మాణ మెటీరియల్ లపై ఉపన్యాసం వుంటుందన్నారు. ఈ నెల 23 న మధ్యాహ్నం 2.30 గంటల నుండి ఫుడ్ కోర్టు, క్విజ్ , టాలెంట్ డిస్ప్లే తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 24 న సాయంత్రం ముగింపు వేడుకలు జరుగుతాయని డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజశేఖర్ తెలిపారు.
ఆడిట్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 న కార్యాలయ సిబ్బంది పిల్లలకు వాకథాన్, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. వ్యవస్థలో అకౌంటెంట్ జనరల్ ఆడిట్ విభాగం నిర్వహిస్తున్న కీలక పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించుటకు భారత కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ వారిచే ప్రతి ఏటా నవంబర్ 16 న ఆడిట్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 3 వ ఆడిట్ దినోత్సవాన్ని న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆడిట్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.