ఆశ వర్కర్స్ కి రెండు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, వెంటనే జాబ్ చాట్ వేయాలని, ఆశా వర్కర్స్ కి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వారి జీతాలను 9,000 నుండి 18 వేలకు వెంటనే పెంచాలని, వారికి ఈఎస్ఐ సభ్యత్వం కల్పిస్తూ.. పి ఎఫ్ వచ్చేలా చూడాలని రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో కోటి లోని డి ఎం ఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ విషయంపై డి ఎం ఈ జాయింట్ డైరెక్టర్ డా,పద్మజా గారికి మెమొరాండం ఇచ్చి వెంటనే సమస్యల పరిష్కారానికి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని.. ఒకవేళ చర్యలు కాలయాపన జరిగినచో రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా తరఫున ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది.