తెలంగాణలో యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. ఈమేరకు వీసీలను నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులను జారీచేశారు. గతంలో యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని పలుమార్లు విద్యర్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడాన్ని విద్యార్ధులు స్వాగతిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, మిగతా యూనివర్సిటీలకు కూడా ఉపకులపతులను నియమించారు.
ఏ యూనివర్సిటీకి ఎవరు వైస్ చాన్సలర్ ?
- ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ – పాలమూరు విశ్వవిద్యాలయం
- ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి – కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
- ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్ – ఉస్మానియా యూనివర్సిటి
- ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ – శాతవాహన యూనివర్సిటి
- ప్రొఫెసర్ నిత్యానందరావు – తెలుగు విశ్వవిద్యాలయం
- ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ – మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం
- ప్రొఫెసర్ యాదగిరిరావు – తెలంగాణ యూనివర్సిటి
- ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య – జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటి
- ప్రొఫెసర్ రాజిరెడ్డి – కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం