Menu

chandrababu pm suryaghar

పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ: సీఎం

ప్రధానమంత్రి సూర్య ఘర్ (PM Suryaghar )పథకం ద్వారా బీసీలకు ఇచ్చే రాయితీకి అదనంగా మరో రూ.20య వేలు సబ్సిడీగా అందిస్తామని ఏపీ సీఎం (AP CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అసెంబ్లీలో తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్లు రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా 2 కి.వాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు రూ.1.20 లక్షల ఖర్చు అవుతుంది. అందులో కేంద్రప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీని అందిస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ప్రకారం బీసీలకు మరో రూ.20 వేలు సబ్సిడి అదనంగా చేకూరనుంది. దీంతో వినియోగదారులకు రూ.80 వేలు రాయితీ రూపంలో లబ్ది చేకూరుతుంది. రాష్ట్రంలో బీసీలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సభలో సీఎం ప్రకటించారు.

Also Read…| Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Share the post