రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చేర్యాల మండలం ఆకునూరు పెద్దవాగు, రుద్రాయపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రాంపూర్ – నర్సాయపల్లి గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.