తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్ రూ.100కోట్ల విరాళాన్ని అందించింది. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు.
రాష్ట్రంలో యువతకు కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఉద్యోగం లేదా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈయేడాది తొలి విడతగా 4 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసందే.
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2024
అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు. pic.twitter.com/mxMonqa8w8