బెంగళూరు రేవ్ పార్టీ (Rave party) కేసులో అరెస్టైన తెలుగు నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమకు కోర్టు ఇటీవల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమెకు బెయిల్ లభించిన నేపథ్యంలో హేమ జైలునుంచి బయటకు రానున్నారు.