టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని బ్యూటీ. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని శ్రీలీల దక్కించుకుంది. తాజాగా లంగా ఓణీలో పుత్తడి బొమ్మలాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు ఈఫోటోలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2017లో చిత్రాంగద అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత రాఘవేంద్ర డైరక్షన్ లో వచ్చిన “పెళ్లి సందడి” సినిమాలో శ్రీలీల ఛాన్స్ దక్కించుకుంది. అనంతరం మాస్ మహారాజ్ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. శ్రీలీల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా లంగా ఓణీతో ఫొటోలకు ఫోజులిచ్చింది.