ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. ఆమె ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలోనే ఉన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ 2009 లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ ఇప్పుడు పార్టీలో చేరిన తర్వాత సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.